calender_icon.png 28 September, 2025 | 7:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్రమాద బాధితులకు వెలిచాల రాజేందర్ రావు బాసట..

28-09-2025 06:16:42 PM

దగ్గరుండి ఆసుపత్రికి తరలింపు..

కొత్తపల్లి (విజయక్రాంతి): రోడ్డు ప్రమాదంలో స్వల్పంగా గాయపడ్డ యువకులకు కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు బాసటగా నిలిచారు. ఆదివారం ఉదయం కొత్తపల్లి మండలం రాణిపూర్ కు చెందిన ఇద్దరు యువకులు వినోద్ రెడ్డి, అవినాష్ ద్విచక్ర వాహనంపై కరీంనగర్ కు వస్తుండగా కొత్తపల్లి శివారులో కుక్క అడ్డు రావడంతో దాన్ని తప్పించబోయి కింద పడ్డారు. దీంతో స్వల్పంగా గాయపడ్డారు. అదే సమయంలో కరీంనగర్ నుంచి కొత్తపల్లి ప్రజా కార్యాలయానికి వస్తున్న వెలిచాల రాజేందర్ రావు రోడ్డు ప్రమాదాన్ని గమనించి ఘటన స్థలం వద్ద ఆగారు. వెంటనే అంబులెన్స్ కు సమాచారం ఇచ్చి వారిద్దరీని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తన కార్యాలయ సిబ్బంది ద్వారా తరలించారు. వారికి మెరుగైన వైద్య సేవలందించాలని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులతో రాజేందర్రావు మాట్లాడారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ తమను వెంటనే ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడిన వెలిచాల రాజేంద్ర రావుకు వినోద్ రెడ్డి, అవినాష్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.