08-05-2025 12:00:00 AM
ఆదివాసీ దుస్తుల్లో ఆకట్టుకున్న ఎమ్మెల్యే బొజ్జు పటేల్
ఉట్నూర్, మే 7 (విజయక్రాంతి): ఆదివాసులు అత్యంత భక్తి శ్రద్ధలతో భావే మహి న (మాసం)ను నిర్వహించడం తరతరాలుగా వస్తున్న ఆచారమని ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పేర్కొన్నా రు. ఉట్నూర్ మండలంలోని కల్లూరు గూడ గ్రామంలో భావే మహిన (మాసం) సందర్భంగా ఆష్టెకర్ ఆత్రం వారి పూజ కార్యక్ర మంలో ఎమ్మెల్యే కుటుంబ సమేతంగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదివాసి సాంప్రదాయ దుస్తుల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ... ఆదివాసీలకు పుస్ మహిన (పుష్య మాసం), భావే మహిన (మాసం) చాలా పవిత్రమైనవని తెలిపారు. ఇతరుల కంటే భిన్నంగా ఆదివాసుల సంస్కృతి సంప్రదాయాలు ఉంటాయని, ప్రకృతినే దైవంగా భావించి పూజలు నిర్వహించడం తరతరాలుగా వస్తున్న ఆచార మన్నారు.
ప్రతి ఒక్కరు సంస్కృతి - సంప్రదాయాలను కాపాడుతూనే, భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంద ని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆష్టెకర్ ఆత్రం పరివార్, గ్రామస్తులు పాల్గొన్నారు.