08-05-2025 12:00:00 AM
తాడ్వాయి, మే, 7 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో బుధవారం ఆర్యవైశ్యులు కలశాలతో ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో కలశాలతో గ్రామంలోని వీధుల్లో ఊరేగింపుగా వెళ్లారు.
అనంతరం శబరిమాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కళశాలలను ఆలయం లో మహిళలు సామూహికంగా కుంకుమ పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్యులు శబరిమాత అమ్మవారిని దర్శించుకుని పూజలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు కిషోర్, గంగా చరణ్ తదితరులు పాల్గొన్నారు.