07-05-2025 11:06:50 PM
కామారెడ్డి (విజయక్రాంతి): హామీ లెగ్గొట్టడానికే అధికారులపై సీఎం రుస రుసలాడుతున్నారని కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలం మాజీ జెడ్పిటిసి పడగల రాజేశ్వరరావు అన్నారు. బుధవారం కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎగ్గొట్టడానికి సోమవారం ప్రభుత్వ ఉద్యోగులపై రుస రుసలాడాడని ఆయన అన్నారు. బాధ్యతగల పదవిలో ఉన్న ముఖ్యమంత్రి ప్రజల అభ్యున్నతి సంక్షేమానికి పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించే ధోరణితో మాట్లాడడం ఎంతవరకు సమంజసంమన్నారు.
ఆనాడే ఆ ఉద్యోగులు అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వానికి భయపడకుండా ఆందోళనలు చేపడితేనే ఈనాడు ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్య మంత్రి అయిన విషయం మర్చిపోవద్దన్నారు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాట్లు ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర గొప్పదన్నారు. అప్పటి ఉద్యమ నాయకుడు కేసిఆర్ కు బాసటగా నిలిచి సకలజనుల సమ్మె చేస్తేనే కేంద్రం దిగివచ్చి తెలంగాణ ఇచ్చిందన్నారు. ఇప్పటికైనా ఉద్యోగుల క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఆచరణ సాధ్యం కానీ దొంగ మిలిచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఖజానా పేరిట ప్రజలకు అందించే సంక్షేమ పథకాలకు ఎగనామం పెట్టాలని చూస్తున్నారన్నారు. ఈ సమావేశంలో రామారెడ్డి మాజీ ఎంపీపీ నారెడ్డి దశరథ్ రెడ్డి, కాలభైరవ స్వామి దేవాలయం మాజీ చైర్మన్ గంజి సతీష్ గుప్తా, గిరిజన నాయకుడు లింబాద్రి, నాయక్ యూత్ నాయకుడు కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.