27 April, 2026 | 1:51 AM

నూతన కలెక్టర్‌గా భవేశ్ మిశ్రా

27-04-2026 12:00 AM

బాధ్యత స్వీకరణ 

నిర్మల్, ఏప్రిల్ 26 (విజయక్రాంతి) : నిర్మల్ జిల్లా నూతన కలెక్టర్గా భవేశ్ మిశ్రా ఆదివారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ముందుగా జిల్లాకు చేరుకున్న నూతన కలెక్టర్కు పూర్వపు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, అదనపు కలెక్టర్లు బి. వెంకటేశ్వర్లు, కిషోర్ కుమార్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు పూలమొక్కలు అందించి స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఆర్డీవో రత్నకళ్యాణి, జిల్లా అధికారులు జీవరత్నం, డా. రా జేందర్, శ్రీనివాస్, నరసింహ రెడ్డి, దయానంద్, భోజన్న, సుధాకర్, విజయలక్ష్మి, రమణ, శ్రీకాంత్‌రెడ్డి, శ్రీనివా స్ తదితరులు పాల్గొన్నారు.