27 April, 2026 | 1:52 AM

సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న నూతన కలెక్టర్ దంపతులు

27-04-2026 12:00 AM

బైంసా, ఏప్రిల్ 26 (విజయక్రాంతి) : నిర్మల్ జిల్లా నూతన కలెక్టర్ భవేశ్ మిశ్రా, ఆయన సతీమణి ఇలా త్రిపాఠి ఆదివారం బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన కలెక్టర్ దంపతులకు ఆలయ అధికారులు, అర్చకులు సాదర స్వాగతం పలికారు. అనంతరం వారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆల య అర్చకులు కలెక్టర్ దంపతులకు తీర్థప్రసాదాలు అందజేసి, ఆశీర్వచనాలు అందించారు.