జర్నలిజంలో భిక్షా నాయక్‌కు డాక్టరేట్
ముషీరాబాద్, ఏప్రిల్ 18(విజయక్రాంతి): జర్నలిజంలో పరిశోధన చేసిన కేతావత్ భిక్షా నాయక్‌కు ఉస్మానియా విశ్వవిద్యాలయం డాక్టరేట్ ప్రకటించింది. సుప్రసిద్ధ రాజకీయ విశ్లేషకులు, విద్యావేత్త, పూర్వ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ పర్యవేక్షణలో ‘ఎఫ్‌ఎం రేడియో ప్రోగ్రామ్స్ అండ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్- యాన్ ఎవాల్యుయేటివ్ స్టడీ ఇన్ హైదరాబాద్’ అనే అంశంపై భిక్షా నాయక్ పిహెచ్.డి. పూర్తి చేశారు.
ఎఫ్‌ఎం రేడియో కార్యక్రమాల రూపకల్పనలో, మార్కెటింగ్ విభాగంలో వ్యూహాత్మక కార్యకలాపాలను ఈ సిద్ధాంత గ్రంథం విపులంగా చర్చిస్తుంది. ఓయూ జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ విభాగం నుంచి కేతావత్ భిక్షా నాయక్‌కు డాక్టరేట్ ప్రకటిస్తూ ఓయూ పరీక్షల విభాగం అదనపు కంట్రోలర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. భిక్షా నాయక్ ప్రస్తుతం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్నారని తెలిపారు.
భిక్షా నాయక్ డాక్టరేట్ పొందడం పట్ల ఆకాశవాణి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ హరిసింగ్, కార్యక్రమ విభాగాధిపతి రమేశ్ సుంకసారి, ప్రాంతీయ వార్తా విభాగాధిపతి ఎంఎస్.మహేశ్, వార్తా విభాగ సంపాదకులు శ్రీనివాస్, ఆకాశవాణి సిబ్బంది తురగా ఉషారమణి, మాధవీలత, కోటేశ్వరి, దుర్గారావు, డా.జె.చెన్నయ్య, డా.సూర్యప్రకాశ్ రావు తదితరులు హర్షం వ్యక్తం చేశారు.






