calender_icon.png 21 January, 2026 | 5:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భక్తులతో భీమేశ్వరస్వామి ఆలయం కిటకిట

20-01-2026 12:00:00 AM

సమక్క సారలమ్మ జాతర సందర్భంగా తరలివచ్చిన భక్తులు

వేములవాడ, జనవరి19(విజయక్రాంతి): సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభంతో రాజన్న సిరిసిల్ల జిలా వేములవాడలోని భీమేశ్వరస్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు.సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు లక్షమందికి పైగా స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీ నేపథ్యంలో ఆలయ ఈఓ రమాదేవి స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షించారు. నీడ టెంట్లు,చలువ పందిళ్లు, తాగునీరు,వైద్య శిబిరం ఏర్పాటు చేసి ప్రత్యేక డ్యూటీలు కేటాయించారు. కోడె మొక్కుల కోసం వచ్చిన భక్తులకు ఇబ్బందులు కలగకుండా కోడెలు కట్టే ప్రదేశంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయ ఉద్యోగులు, పోలీసులు, సేవాసమితి సభ్యులు భక్తులకు సేవలు అందించారు.