20-01-2026 12:00:00 AM
కూతురిపైనా హత్యాయత్నం
ఆ తర్వాత నిందితుడి ఆత్మహత్యాయత్నం
సిద్దిపేట పట్టణంలో ఘటన
సిద్దిపేట క్రైం, జనవరి 19: భార్యపై అనుమానంతో ఆమె గొంతుకోసి చంపేశాడో భర్త. కూతురు గొంతు కూడా కోసి, తాను ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన సిద్దిపేట పట్టణంలో సోమవారం జరిగింది. సిద్దిపేట జిల్లా దూల్మిట్ట మండలం బెక్కల్ గ్రామానికి చెందిన దున్నపోతుల శ్రీలత, ఎల్లయ్యకు 18 సంవత్సరాల క్రితం వివా హం జరిగింది. వారికి కూతురు హర్షిత (16), కుమారుడు అజయ్ (14) ఉన్నారు. కొంతకాలంగా ఎల్లయ్య తన భార్య శ్రీలతపై అనుమానం పెంచుకొని నిత్యం మానసికంగా, శారీరకంగా వేధింపులు గురిచేస్తున్నా డు.
శ్రీలత తండ్రి శివరాత్రి కనక పోచయ్య పలుమార్లు మందలించినప్పటికీ ఎల్లయ్య ప్రవర్తనలో మార్పు రాలేదు. హాస్టల్‌లో ఉండి చదువుకుంటున్న ఇద్దరు పిల్లలు సంక్రాంతికి ఇంటికి రాగా, కుల పెద్దల సమక్షంలో ఎల్లయ్యకు మరోసారి నచ్చజెప్పారు. ఇక మీదట మంచిగా చూసుకుంటానని చెప్పి బతుకుదెరువు కోసం శ్రీలతను వెంట తీసుకుని హైదరాబాద్ వలస వెళ్లాడు. పది రోజుల క్రితం సిద్దిపేటకు వచ్చిన ఎల్లయ్య.. భార్య, పిల్లలతో ఆదర్శనగర్‌లో ఓ అద్దె ఇంట్లో ఉంటున్నాడు. ఈ క్రమంలోనే సోమవారం తెల్లవారుజామున భార్య శ్రీలత, కూతురు హర్షిత గొంతులు కోసిన ఎల్ల య్య..
తర్వాత తానూ గొంతు కోసుకున్నా డు. శ్రీలత ఘటన స్థలంలోనే మృతి చెంద గా, తీవ్రంగా గాయపడిన హర్షిత, ఎల్లయ్య ను ఆసుపత్రిలో చేర్పించారు. హర్షిత ఆరో గ్య పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఆసుప త్రికి బంధువులు తరలించారు. శ్రీలత తండ్రి కనక పోచయ్య ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసినట్టు టూటౌన్ ఇన్‌స్పెక్టర్ ఉపేందర్ చెప్పారు. నిందితుడు ఎల్లయ్య ప్రస్తుతం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు.