31 August, 2026 | 11:59 PM

అభివృద్ధి పనులకు భూమి పూజ

31-08-2026 11:03 PM

మెట్ పల్లి,(విజయక్రాంతి): పట్టణంలోనీ ఎనిమిదవ వార్డ్ లో అభివృద్ధి పనులకు కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ భూమి పూజ చేశారు. వార్డులో రెండు లక్షల వ్యయంతో చేపట్టనున్న నూతన డ్రైనేజీ నిర్మాణ పనులకు భూమి పూజ అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణంలో మౌలిక వసతుల కల్పనకు, పారిశుద్ధ్య మెరుగుదలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. వార్డు పరిధిలో స్థానికులు ఎదుర్కొంటున్న మురుగునీటి సమస్యకు నూతన డ్రైనేజీ నిర్మాణంతో శాశ్వతంగా పరిష్కరిస్తామని చెప్పారు.

పనులను నాణ్యతా ప్రమాణాలతో, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి, వైస్ చైర్మన్ ఓంకార్ నవీన్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ గౌడ్, డీఈ నాగేశ్వరరావు,వార్డు కౌన్సిలర్ ధీవకొండ మానసవిష్ణు,  పురుషోత్తం, అజయ్, నరేష్,ఆనంద్,నాయకులు,పుదారి సుధాకర్,పెద్ద సలీం,కిషోర్,వేణు గోపాల్,లింగేశ్వర్,మొరపు తేజ, జావిద్, రవి ప్రజలు పాల్గొన్నారు.