1 September, 2026 | 1:11 AM

బస్తీ దవాఖానాలలో వెంటనే వైద్యులను నియమించాలని కలెక్టర్ కు వినతి

31-08-2026 11:57 PM

ఘట్ కేసర్,(విజయక్రాంతి): ఘట్ కేసర్ డివిజన్ పరిధిలోని ఎన్ ఎఫ్ సి నగర్, బాలాజీ నగర్ బస్తీ దవాఖానాలలో వెంటనే  వైద్యులను నియమించి, పోస్టింగ్ ఇవ్వాలని కోరుతూ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు బొక్క ప్రభాకర్ రెడ్డి సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణిలో వినతి పత్రాన్ని అందజేశారు.బస్తీ దవాఖానాలలో ప్రస్తుతం వైద్యులు ఎవరూ అందుబాటులో లేరని, వందలాది మంది రోజువారీ కూలీలు, అల్పాదాయ కుటుంబాలు, స్థానిక నివాసితులు తమ రోజువారీ వైద్య అవసరాలు, అత్యవసర ప్రాథమిక చికిత్స కోసం పూర్తిగా ఈరెండు ఆరోగ్య కేంద్రాలపైనే ఆధారపడి ఉన్నారని తెలిపారు.

వైద్యులు లేకపోవడం వల్ల రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. స్థానికులు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తోందని అయితే ఆఖర్చులను భరించే స్తోమత చాలామందికి లేదని, కావున  ఈవిషయంపై తక్షణమే స్పందించి, సంబంధిత ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించి బస్తీ దవాఖానాలలో అర్హులైన వైద్యులను వెంటనే నియమించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కొంతం అంజిరెడ్డి, బొక్క సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.