గంజాయి దందాపై పోలీసుల ఉక్కుపాదం
ఇద్దరు అరెస్ట్ 5 కిలోల గంజాయి స్వాధీనం
గద్వాల టౌన్: జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో గంజాయి అక్రమ విక్రయాలకు పాల్పడుతున్న ఇద్దరిని గద్వాల పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు.వారి వద్ద నుంచి సుమారు 5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.పట్టుబడిన గంజాయి విలువ బహిరంగ మార్కెట్‌లో సుమారు 6 లక్షల రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు. గంజాయి అక్రమంగా విక్రయిస్తున్నారన్న సమాచారంతో గద్వాల పట్టణ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సమాచారం ఆధారంగా ఇద్దరిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా వారి వద్ద గంజాయి లభించినట్లు పోలీసులు వెల్లడించారు.
గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు తెలిపారు. ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన పోలీసు సిబ్బందిని గద్వాల డీఎస్పీ మొగులయ్య అభినందించి సత్కరించారు. యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడేందుకు గంజాయి,ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు కొనసాగిస్తామని పోలీసులు తెలిపారు. ఈ సమావేశంలో గద్వాల సీఐ టంగుటూరి శ్రీనివాస్,టౌన్ ఎస్‌ఐ కళ్యాణ్ కుమార్ పాల్గొన్నారు.






