23 June, 2026 | 9:45 PM

Breaking News

గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌కు 27 ఎకరాలు కేటాయించాం   •   ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •   రెవెన్యూ ఇన్స్పెక్టర్ పనితీరు భేష్..   •  

భూ భారతి దరఖాస్తులను పరిష్కరించాలి

25-03-2026 01:43 AM

కలెక్టర్ అభిలాష అభినవ్

నిర్మల్, మార్చి 2౪ (విజయక్రాంతి): మన ఇసుక యాప్ ద్వారానే ఇసుక అమ్మకాల అనుమతులు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం రాత్రి, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, మన ఇసుక వాహనం యాప్, భూ భారతి దరఖాస్తుల పరిష్కారం, పౌర సేవల గుర్తింపు పత్రాల జారీ, తదితర రెవెన్యూ సంబంధిత అంశాలపై కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో, సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఇక ముందు జిల్లాలో మన ఇసుక వాహనం యాప్ ద్వారానే ఇసుక అమ్మక అనుమతులు ఇవ్వాలన్నారు. యాప్ వివరాలపై తహశీల్దార్లకు అవగాహన కల్పించారు. రెవెన్యూ అధికారులంతా ఈ యాప్ పై అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. అన్ లైన్ విధానంలో మాత్రమే ఇసుక అమ్మక కూపన్ లు ఇవ్వాలన్నారు. ఈ విధానం వల్ల ఇసుక విక్రయాల్లో పారదర్శకత పెరుగుతుందన్నారు. పెండింగ్ లో ఉన్న భూభారతి దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలని తెలిపారు.

అన్ని రకాల పౌర సేవల గుర్తింపు పత్రాల జారీ ప్రక్రియలో అధికారులు ఆలస్యం చేయకూడదని చెప్పారు. వెంట వెంటనే సర్టిఫికెట్ లు జారీ చేయాలని వివరించారు. మండలాలకు సంబంధించి పెం డింగ్‌లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని తెలిపారు. ఈ సమావే శంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, ఏడి మైన్స్ హరి ప్రసాద్, భూగర్భ జలాల శాఖ సంచాలకులు శ్రీనివాసబాబు, తహసిల్దార్లు పాల్గొన్నారు.