23 June, 2026 | 11:06 PM

Breaking News

గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌కు 27 ఎకరాలు కేటాయించాం   •   ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •   రెవెన్యూ ఇన్స్పెక్టర్ పనితీరు భేష్..   •  

జూపల్లిని కలిసిన మున్సిపల్ కౌన్సిలర్లు

25-03-2026 01:43 AM

కాగజ్‌నగర్, మార్చి 24 (విజయ క్రాంతి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావును మంగళవారం హైదరాబాద్లో ఎమ్మెల్సీ దండే విఠల్‌తో  పాటు కాగజ్‌నగర్ మున్సిపల్ కౌన్సిలర్లు మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో ఉన్న పలు సమస్యలు, పట్టణ అభివృద్ధి పనులపై మంత్రితో చర్చించారు.

మున్సిపాలిటీలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరగా మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ దస్తగిరి, కాంగ్రెస్ కౌన్సిలర్లు షబ్బీర్ హుస్సేన్, యూసఫ్ ఖాన్, కావేటి విజయ్, సూరజ్ తదితరులు పాల్గొన్నారు. పట్టణ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని మంత్రి హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు.