calender_icon.png 31 July, 2025 | 4:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడిగా భూక్యా సంజీవ నాయక్

30-07-2025 07:52:44 PM

కోదాడ: తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడిగా అనంతగిరి మండలం, కొత్తగూడెం గ్రామానికి చెందిన భూక్యా సంజీవ నాయక్ నియమితులయ్యారు. బుధవారం తెలంగాణ రాష్ట్ర జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Telangana State Jagruthi President Kalvakuntla Kavitha) ఆయనకు జాగృతి కండువా కప్పి జిల్లా అధ్యక్షుడిగా నియమింపజేశారు. ఈ మేరకు భూక్యా సంజీవ నాయక్ మాట్లాడుతూ.. జాగృతి బలోపేతానికి కృషి చేస్తానన్నారు. ఆయన నియామకం పట్ల పలువురు నాయకులు హర్షం వ్యక్తం చేశారు. భూక్యా సంజీవ నాయక్ సమక్షంలో పలువురు మాజీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు జాగృతిలో చేరారు. ఆయన ఆధ్వర్యంలో పలు గ్రామాలు, మండలాలకు కమిటీలను నియమించారు.