calender_icon.png 31 July, 2025 | 4:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్ఐ ప్రవీణ్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలి

30-07-2025 07:50:32 PM

మునగాల (విజయక్రాంతి): మునగాల ఎస్ఐ ప్రవీణ్ కుమార్(SI Praveen Kumar)పై  అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలని సామాజిక కార్యకర్త జిల్లేపల్లి వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ... గత పది హేను నెలల నుండి మండలంలోని సమస్యత్మకమైన గ్రామాల్లో అవంచనీయ సంఘటనలు జరగకుండా నిత్యం 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటూ విద్యార్థులకు గంజాయి మత్తుపదార్థాల వంటి వాటిపై అవగాహన కల్పిస్తూ ట్రాఫిక్ రూల్స్ ప్రమాదాలు సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తూ మండల ప్రజల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ కంటికి రెప్పలా కాపాడుతున్న మునగాల ఎస్సై ప్రవీణ్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు చేయటం దుర్మార్గమని తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో కాలే సామిల్ ఈదర్ రావు లంజపల్లి శ్రీను తక్కలపాటి సాయికుమార్ పాషా పనస శంకర్ దొంగరి అప్పారావు నాగరాజు జిల్లేపల్లి వినయ్ శ్రీను తదితరులు పాల్గొన్నారు.