30-07-2025 07:57:59 PM
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇందిరమ్మ ఇంటి నిర్మాణం చేపట్టాలని హౌసింగ్ పిడి వేణుగోపాల్(Housing PD Venugopal) అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని సందీప్ నగర్ లో ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను పరిశీలించారు. ప్రభుత్వం అందజేస్తున్న ఇందిరమ్మ ఇల్లు నిర్మాణ పనులను మంజూరైన లబ్ధిదారులు ఆగస్టు 15 లోగా పనులు ప్రారంభించాలని తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది, నాయకులు కార్తీక్, అసద్, సాహిద్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.