భువనగిరి ఎంపీ విజయోత్సవ ర్యాలీ
యాదాద్రి భువనగిరి, జూన్ 6 (విజయక్రాంతి): భువనగిరి పార్లమెంట్ స్థానం నుంచి గెలుపొందిన చామల కిరణ్‌కుమార్ రెడ్డి.. జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలతో కలిసి గురువారం యాదగిరిగుట్ట పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రజలకు అభివాదం చేస్తూ ప్రధాన వీధుల గుండా ఊరేగింపుగా బయలుదేరి యాదాద్రి కొండపైకి చేరుకున్నారు. కొండపై ఆలయ అర్చకులు వారికి ఘన స్వాగతం పలికారు. ఎంపీ, ఎమ్మెల్యేలు కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ర్యాలీలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, డీసీసీ అధ్యక్షులు అండెం సంజీవరెడ్డి, యాదగిరిగుట్ట ఎంపీపీ చీర శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.






