16 July, 2026 | 3:41 AM

గుండం చెరువు కబ్జాపై అధికారుల సర్వే

07-06-2024 02:02 AM
  • చెరువులో ఎఫ్‌టీఎల్ సరిహద్దుల ఏర్పాటు
  • ఫెన్సింగ్ జాలి తొలగించాలని ఆదేశాలు

సంగారెడ్డి, జూన్ 6 (విజయక్రాంతి): ‘గుండం చెరువుకు కబ్జా గండం’ అనే శీర్షికతో విజయక్రాంతిలో గురువారం ప్రచురిత మైన కథనానికి అధికారులు స్పందించారు. జిల్లా కలెక్టర్ గుండం చెరువు ఎఫ్‌టీఎల్ సర్వేకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో నీటిపారుదల, రెవెన్యూ అధికారులు సర్వే చేసి చెరువు సరిహద్దులు గుర్తించారు. ఎఫ్‌టీఎల్ పరిధి ఎంత వరకు ఉందో సర్వే చేసి గుర్తించారు. నివేదికను జిల్లా అధికారులకు పంపించి వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని  తెలిపారు. అలాగే ఫెన్సింగ్ జాలి తొలగించాలని ఆదేశాలిచ్చారు. సర్వేలో జహీరాబాద్ నీటిపారుదల శాఖ ఈఈ విజయకుమార్, డీఈఈ వెంకట్‌రాంరెడ్డి, ఏఈ రవీందర్, రెవెన్యూ, సర్వే అధికారులు  పాల్గొన్నారు