మల్లన్న ముందంజ
మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తి
తీన్మార్ మల్లన్నకు 1,22,813 ఓట్లు
బీఆర్‌ఎస్ అభ్యర్థి రాకేశ్‌రెడ్డికి 1,04,248
బీజేపీ ప్రేమేందర్‌రెడ్డికి 43,313 ఓట్లు
స్వతంత్ర అభ్యర్థి అశోక్‌కు 29,697 ఓట్లు
గెలుపునకు కావాల్సిన ఓట్లు ౧,౫౫,౦౯౫ ఓట్లు
50 శాతం ఓట్లు ఎవరికీ రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు
నల్లగొండ (సూర్యాపేట), జూన్‌౬ (విజయక్రాంతి): నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల స్థానం ఎమ్మెల్సీ ఉప ఎన్నిక మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ఎట్టకేలకు ముగిసింది.. అయితే, గెలుపునకు కావాల్సిన ౧,౫౫,౦౯౫ ఓట్లు(౫౦ శాతం) ఏ అభ్యర్థికి రాకపోవడంతో ఎన్నికల అధికారులు రెండో ప్రాధాన్యత ఓట్ల కౌంటింగ్‌ను ప్రారంభించారు. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓట్లు ౧,౨౨,౮౧౩ రాగా, బీఆర్‌ఎస్ అభ్యర్థి రాకేశ్‌రెడ్డికి ౧,౦౪,౨౪౮ ఓట్లు దక్కాయి. బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డికి కేవలం ౪౩,౩౧౩ ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్‌కు ౨౯,౬౯౭ ఓట్లు రావడం గమనార్హం. కాగా, ౫౦శాతం ఓట్లు ఏ అభ్యర్థికి రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. శనివారం మధ్యాహ్నం వరకు విజేత ఎవరో తెలిసే అవకాశమున్నది.
లెక్కింపు కేంద్రం వద్ద ఉద్రిక్తత
నల్లగొండ జిల్లా కేంద్రంలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఫలితాల ప్రకటనలో అధి కారులు అవకతవకలకు పాల్పడుతున్నారని బీఆర్‌ఎస్ నేతలు ఆందోళన చేపట్టారు. రిటర్నింగ్ అధికారి ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరిస్తు న్నారంటూ ఆరోపించారు. తమ అభ్యంతరాలు స్వీకరించిన తర్వాతనే కౌంటింగ్ మొదలుపెట్టాలని డిమాం డ్ చేశారు. ఈ క్రమంలో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కాస్త ఆలస్యమైనది. నల్లగొండ కౌంటింగ్ కేంద్రం లో ఆర్వో తీరును నిరసిస్తూ రాకేశ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
తన గెలుపును అడ్డుకునేందుకు ఓట్ల లెక్కింపు లో అనేక అవకతవకలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కౌంటింగ్ కేం ద్రాల నుంచి తమ ఏజెంట్లను బయటకు పంపించేస్తున్నారని అన్నారు. ఏకపక్షంగా ఫలితాలు ప్రకటిస్తున్నారని, రౌండ్లు పూర్తయిన తర్వాత కనీసం తమ ఏజెంట్స్ వద్ద సంతకాలు కూడా తీసుకోవడం లేదని ఆరోపణలు చేశారు. ఆర్వోను కలిసేందుకు వెళ్తే పోలీసులు అడ్డుకుంటున్నారని తెలిపారు. పారదర్శంగా కౌంటింగ్ జరపా లని డిమాండ్ చేశారు. రాష్ట్ర, కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకువాలని విజ్ఞప్తిచేశారు. కాగా, తిప్పర్తి పోలీస్ స్టేషన్‌లో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డిపై కేసు నమోదైంది.
సీఈవో వికాస్‌రాజ్‌కు ఫిర్యాదు
ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటిం గ్ పారదర్శకంగా జరుగట్లేదని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌కు ఫిర్యాదుచేశారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లె క్కింపులో మూడో రౌండ్‌లో౫౩౩, నాలుగో రౌండ్‌లో ౧౭౦ పైచిలుకు ఓట్ల మెజారిటీ బీఆర్‌ఎస్‌కు వచ్చిందని, రాకేశ్‌రెడ్డికి వచ్చిన లిస్టులో మాత్రం ఆధిక్యం తీన్మార్ మల్లన్నకు చూపించారని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని సీఈవోను కోరారు.






