calender_icon.png 5 May, 2025 | 10:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైకిల్ ఫ్రెండ్లీ సిటీ!

20-04-2025 12:00:00 AM

అమెరికాలోని మిచిగాన్ రాష్ట్రంలో సైకిళ్లకు ప్రత్యేకంగా ఒక నగరం ఉందని మీకు తెలుసా? దాన్నే మాకినాక్ ఐలాండ్‌గా పిలుస్తారు. ఈ నగరం విశేషాలేంటో తెలుసుకుందాం..

ప్రపంచంలోని అత్యుత్తమమైన సదుపాయాలు, కాలు ష్యం లేని నగరాల్లో ఒకటి మాకినాల్ ఐలాండ్. రోడ్ల మీద సైకిల్ లైన్లు, పార్కింగ్ స్థలాలు ఉంటాయి. ఇటీవల ఈ నగరం సైక్లింగ్ లో నెంబర్ వన్ గా నిలిచింది. 

అమెరికాలోని మిచిగాన్ రాష్ట్రంలో అదో చిన్న ద్వీపం. నిజానికి   దీన్ని మాకినాక్ సిటీ అనిపిలుస్తారు. ఈ నగరంలోకి అడుగెడితే సైకిళ్లు మాత్రమే కనపడతాయి. పిల్లలు, పెద్దలు, టూరిస్టులు రోడ్లపై హాయి గా సైకిల్ తొక్కుతూ వెళ్తుంటారు. సైకిళ్లకు స్వర్గధామం అన్నట్లుంటుం ది నగరం. ప్రపంచంలోనే నంబర్ వన్ బైసైకిల్ ఫ్రెండ్లీ సిటీ ఇది. 

మిచిమకినాక్ అనే పదం నుంచి మాకినాక్ అనే పేరొచ్చింది. మిచిమకినాక్ అంటే పెద్ద తాబేలు అని అర్థం. వాస్తవానికి ఈ ద్వీపం పైనుంచి చూస్తే తాబేలులా ఉంటుంది. 17వ శతాబ్దం తొలినాళ్లలోనే బ్రిటీషర్స్ అక్కడ స్థావరం ఏర్పరచుకున్నారు. 19వ శతాబ్దం నుంచి ఈ నగరం టూరిస్ట్ స్పాట్ గా మారింది. ’సమ్మర్ కాలనీ‘ పేరుతో కూడా పిలుస్తారు. 

ఈ నగరంలోని మిచిగాన్ సరస్సు, హోగన్ సరస్సు, చారిత్రక ప్రదేశాలను సైకిళ్ల మీద వెళ్లి చూడటం అద్భుతమైన జాపకమంటారు* టూరిస్టులు. ఎక్కడ చూసినా సైకిళ్లు అద్దెకిచ్చే అంగళ్లు, సైకిల్ రిపేర్ షాప్స్, పార్కింగ్ స్థలాలు.. రోడ్డు మీద సైకిళ్ల డిజైన్లు ఉంటాయి. సైకిళ్ల మీద స్థానికులు ఠీవీగా వెళుతూ టూరిస్టులను నవ్వుతూ పలకరిస్తుంటారు. సైకిళ్లను వారాలపాటు అద్దెకు తీసుకున్న వారికి మంచి బస కూడా ఇస్తారు.

అంతేనా దివ్వాంగులకూ అద్భుతమైన డిజైనింగ్ సైకిళ్లు ఉంటాయి. ఇక్కడ సైకిళ్లతో పాటు గుర్రపు బండ్లు మాత్రమే కనిపిస్తాయి. అన్నట్లు కార్ ఫ్రీ సిటీ ఇది. అంటే కార్లకు ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతి లేదన్నమాట. అందుకే ప్రపంచం నలుమూలల నుంచి సైకిల్ లవర్స్ ను ఈ ఐలాండ్ ఆకర్షిస్తోంది.

సైకిల్ టూరిజానికి మాకినాక్ నగరం ప్రసిద్ధి గాంచింది. ఇక్కడ ప్రత్యేకంగా సైకిల్ క్లబ్స్ ఉన్నాయి. యూత్‌తో పాటు సీనియర్ సిటిజన్ గ్రూప్స్ ఉన్నాయి. ఏడాది పొడవునా ప్రత్యేకమైనా ఈవెంట్స్ చేస్తుంటారు.

ప్రపంచంలోనే నంబర్ వన్

ప్రపంచంలోనే ఏమాత్రం ఒత్తిడి లేకుండా సైక్లింగ్ చేసే ప్రాంతమిది. అక్కడి రోడ్లు.. ఫ్రెండ్లీ సైక్లింగ్, సదుపాయాలు.. ఇలా అన్నింటినీ పరిగణలోకి తీసుకుని వంద మార్కులకు ర్యాంకింగ్ కేటాయించారు. మాకినాక్ ఐలాండ్‌కు వందకు 99.35 శాతం మార్కులు వచ్చాయి. అంటే సైకిల్ ఫ్రెండ్లీ లో మొదటిస్థానం అన్నమాట. ఆ తర్వాత స్థానాల్లో ప్రావిన్స్ టౌన్, హార్బర్ స్ప్రింగ్స్, ది హాగ్ (నెదర్లాండ్స్) వాష్ బర్న్, ఫోర్ట్ యేట్స్, పారిస్, బ్రస్సెల్స్ ఉన్నాయి.