calender_icon.png 27 October, 2025 | 10:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్మారక ఉత్సవాలలో భాగంగా సైకిల్ ర్యాలీ

27-10-2025 07:40:49 PM

చిట్యాల (విజయక్రాంతి): పోలీస్ అమరవీరుల స్మారక ఉత్సవాలలో భాగంగా రామన్నపేట పట్టణంలో సోమవారం సైకిల్ ర్యాలీ నిర్వహించగా సీఐ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. పోలీసు అమరవీరుల స్మారక ఉత్సవాల సందర్బంగా రామన్నపేట మండలంలో సైకిల్ ర్యాలీను పోలీసు స్టేషన్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు రామన్నపేట పోలీస్ ల ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రజలకు అమరవీరుల సేవల గుర్తు చేసుకుంటూ, వారు చేసిన త్యాగలను స్మరించుకుంటూ, పోలీసు సంస్కరణల గురించి ప్రజలకు, పోలీసు వారికీ ఉన్న సంబంధాలను ప్రజలకు అవగాహన కలిగించారు.

అనంతరం లక్ష్మాపురం, శోభనాద్రిపురం చౌరస్తాలో ఉన్న 2006లో ఆత్మకూరు పోలీసు స్టేషన్ నక్సలైట్ ఎటాక్ లో వీర మరణం పొందిన ఇంజమూరు లింగయ్య, హోమ్ గార్డ్ విగ్రహంనకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. వారి అమ్మ సూరమ్మకు పండ్లు ఇచ్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై డి.నాగరాజు సిబ్బంది, ఎఎస్ఐ ఎం.సురేందర్, రాంబాబు, కమలాకర్, డి.స్వామి,లింగస్వామి, కవిత, రామన్నపేట మండల నాయకులు అక్రమ్, పృథ్వీ, జూనియర్ కళాశాల సిబ్బంది  లు పాల్గొన్నారు.