27-10-2025 06:06:48 PM
గంభీరావుపేట (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా గంభీరావుపేట సోమవారం ఎస్సై అనిల్ కుమార్ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఎస్సై అనిల్ కుమార్ మాట్లాడుతూ మన సమాజ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. ఈ ర్యాలీ ద్వారా యువతలో జాతీయ భావన, క్రమశిక్షణ, సేవా నిబద్ధత పెంపొందించడమే మా ఉద్దేశ్యం” అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు కూడా పోలీస్ అమరవీరులకు నివాళులు అర్పిస్తూ, “జై జవాన్ – జై హింద్” నినాదాలు చేశారు. కార్యక్రమంలో ఆక్స్ఫర్డ్ స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.