27-10-2025 06:10:23 PM
ముస్తాబాద్ (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో సోమవారం స్థానిక ఎస్సై గణేష్ ఆధ్వర్యంలో అమరవీరుల వారోత్సవాల సందర్భంగా నాయకులతో కలిసి పోలీసులు సైకిల్ ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా ఎస్సై గణేష్ మాట్లాడుతూ అమరవీరుల వారోత్సవాలలో భాగంగా విధి నిర్వహణలో అమరులైన పోలీస్ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అమరులైన పోలీసులకు ఆత్మకు శాంతి చేకూరాలని ఘన నివాళులు అర్పించారు. ప్రతి ఒక్కరు సమాజంలో బాధ్యతగా మెరుగైన సమాజ నిర్మాణంలో పోలీసులకు సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు ఏళ్ల బాల్రెడ్డి, గజ్జల రాజు, మాజీ ఎంపిటిసి శ్రీనివాస్, భాను, ఆంజనేయులు, నాయకులు, యువకులు, పోలీసులు తదితరులు పాల్గొన్నారు.