08-12-2025 12:00:00 AM
బిఆర్‌ఎస్ ను నమ్ముకున్నందుకు నట్టేట ముంచారు.. బాచిరెడ్డి
కొత్తగూడెం, డిసెంబర్ 7, (విజయక్రాంతి ):ఎంపీ రామ సహాయం రఘు రామరెడ్డి ఆధ్వర్యంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆశీస్సులతో ,అలాగే ఊకంటి గోపాలరావు, వీరబాబు, కంచర్ల చంద్రశేఖర్, ఆల మురళి, జేవీఎస్ చౌదరి, తూమ్ చౌదరి, కోనేరు చిన్ని నాగ సీతారాములు, డిసిసి తోట దేవి ప్రసన్న ఆధ్వర్యంలో కాంగ్రెసులో చేరిన టిఆర్‌ఎస్ పార్టీ నాయకులు బాచి రెడ్డి చుంచుపల్లి మండలంలో మండలంపై పట్టు ఉన్న యువ నాయకుడు, కాంగ్రెస్ పార్టీలో చేరడంతో బిగ్ షాక్ తగిలినట్టు అయ్యింది.
ఆదివారం మీడియాకు విడుదల చేసిన ఓ ప్రకటనలో బాచి రెడ్డి మాట్లాడుతూ గత 12 సంవత్సరాలుగా గ్రామస్థాయి నుండి కష్టపడి ,పార్టీని బలోపేతం చేసినప్పటికీ పార్టీలో సరైన గుర్తింపు ఇవ్వకపోవడంతో, తన అనుచరులు 100 కుటుంబాలతో, కాంగ్రెస్లో చేరినట్లు తెలిపారు. టిఆర్‌ఎస్ పతనం గ్రామాల నుంచే మొదలైందని, టిఆర్‌ఎస్పు ప్రజలకు నమ్మకం పోయిందని పంచాయతీ ఎన్నికల్లో, కాంగ్రెస్ జెండా ఎగరడం కోసం ఎదురుచూస్తుందని, టిఆర్‌ఎస్ ప్రభుత్వంలో షో చేయడం తప్ప పనులు చేసే పరిస్థితి కనపడటం లేదని,
సుభిక్షంగా ఉన్న గ్రామాలు నేడు వెలవిలలాడుతున్నాయని కన్నెత్తి చూసేవాడే లేడని ఆయన అన్నారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, అమలు చేస్తున్న పథకాలకు ఆకర్షితునై, అపతకాలను గ్రామస్థాయి నుండి కష్టపడి గ్రామ సర్పంచ్లను గెలిపించే బాధ్యతను తన భుజాలపై వేసుకొని గెలుపే లక్ష్యంగా పనిచేస్తానని అన్నారు బాచిరెడ్డి..