24 June, 2026 | 8:57 AM

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

14-06-2024 12:39 PM

రాజన్నసిరిసిల్ల, (విజయక్రాంతి): రాజన్నసిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం సంభవించింది. రుద్రంగి గ్రామ శివారు ప్రాంతంలో ఆర్టీసీ బస్సు, బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైకుపై ఉన్న గండి అజయ్, అభిలాష్ ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. అజయ్ అక్కడికక్కడే మృతిచెందగా, అభిలాస్ ను ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు.