24 June, 2026 | 7:43 AM

స్కూల్ బస్సుల ఫిట్‌నెస్‌పై రవాణా శాఖ తనిఖీలు

14-06-2024 02:11 PM

జగిత్యాల: తెలంగాణలో పాఠశాలలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో అధికారులు స్కూల్, కాలేజీ బస్సుల ఫిట్నెస్ తనిఖీలు చేస్తున్నారు. జగిత్యాల జిల్లాలో రవాణా శాఖ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. బస్ ఫిట్నెస్, ఇన్సూరెన్స్, పర్మిట్, డ్రైవింగ్ లైసెన్స్ , ఫైర్ సేఫ్టీ, ఫస్ట్ ఎయిడ్ కిట్లను శుక్రవారం అధికారులు తనిఖీ చేశారు. ఫిట్నెస్ లేని స్కూల్, కాలేజ్ బస్సులు తనిఖీ చేసి అధికారులు సీజ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఫిట్నెస్ లేని మూడు స్కూల్ బస్సులను సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. జగిత్యాల జిల్లాలో 464 స్కూల్, కాలేజ్ బస్సులు ఉండగా, అందులో 300 బస్సుల మాత్రమే ఫిట్నెస్ కలిగి ఉన్నాయని మిగతా బస్సులు కూడా ఫిట్నెస్ చేయించుకోవాలని సూచించారు. ఫిట్నెస్ లేని స్కూల్, కాలేజ్ బస్ లో రోడ్లపై కి వస్టే కఠిన చర్యలు ఉంటాయని డిటిఒ వంశిధర్ హెచ్చరించారు