24 June, 2026 | 10:11 AM

మంచిర్యాల ప్రభుత్వాసుపత్రి ముందు ధర్నా

14-06-2024 12:31 PM

మంచిర్యాల, (విజయక్రాంతి): మంచిర్యాలలో గోడ కూలీ ముగ్గురు కార్మికులు మృతి చెందిన విషాదఘటనలో కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలంటూ మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రి ముందు ధర్నాకు దిగారు. గోడ కూలి ముగ్గురు కూలీలు మృతి చెందిన సంఘటన మంచిరాల్య జిల్లా కేంద్రంలోని బెల్లంపల్లి చౌరస్తా సమీపంలో గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నందిని ఆసుపత్రి వెనకాల యాజమాన్యం మరో భవనం నిర్మాణం చేపట్టారు. 12అడుగల సెల్లార్‌లో ఫిల్లర్ల పనులను ఎనిమిది మంది కార్మికులు చేస్తున్నారు. ఒకరి వెనక ఒకరు పైకి వస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు పక్క ఇంటి కంపౌండ్ వాల్ కూలింది. అప్పటికే నలుగురు పైకి రాగా మిగిలిన నలుగురు ఎనంక హన్మంతు(45), గోలం పోశం(48), ఆత్రం శంకర్(42), మైదం రామన్నపై గోడ కూలింది. ఆత్రం శంకర్, ఎనంక హన్మంతు, గోలం పోశం మృతిచెందగా.. రామన్నకు గాయాలయ్యాయి. సంఘటనా స్థలాన్ని రామగుండం సీపీ శ్రీనివాసులు, మంచిర్యాల అదనపు కలెక్టర్ రాహుల్, మంచిర్యాల ఆర్డీవో రాములు, మున్సిపల్ కమిషనర్ మారుతీ ప్రసాద్ పరిశీలించారు.