6 March, 2026 | 4:40 AM

తల్లి బంగారంతో ప్రియుడికి బైక్

06-03-2026 02:56 AM

ఇన్‌స్టాగ్రామ్ పరిచయం నుంచి ప్రేమాయణం

కన్నతల్లి బంగారం అమ్మిన యువతి

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘటన

రాజన్న సిరిసిల్ల, మార్చి 5 (విజయక్రాంతి): ఇన్‌స్టాగ్రామ్‌లో యువకుడితో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీయడంతో అతడి కోసం ఓ యువతి తన తల్లి బంగారం అమ్మి ఖరీదైన బైక్ కొనిచ్చింది. ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతికి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన యువకుడితో పరిచయం ఏర్పడింది. పరిచయం ప్రేమగా మారింది.

ఈ క్రమంలో యువకుడు తనకు ఖరీదైన ద్విచక్ర వాహనం కొనివ్వాలని యువతిపై ఒత్తిడి తెచ్చాడు. ప్రియుడి కోసం యువతి తన తల్లి వద్ద ఉన్న బంగారాన్ని అమ్మి, వచ్చిన డబ్బుతో ఖరీదైన బైక్ కొని ప్రియుడికి గిఫ్ట్‌గా ఇచ్చిం ది. ఇంట్లో బంగారం కనిపించకపోవడం తో యువతి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు విచారణ చేపట్టడంతో అసలు విషయం వెలుగు చూసింది. దీం తో ఇరు కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. ఎల్లారెడ్డిపేట పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.