calender_icon.png 28 July, 2025 | 10:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డీసీఎంను ఢీ కొట్టిన బైక్

28-07-2025 01:26:48 AM

ఒకరు మృతి ఇద్దరికి తీవ్ర గాయాలు

కుత్బుల్లాపూర్, జులై 27(విజయ క్రాంతి): జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఐడిపిఎల్ గాంధీనగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనుక నుండి బైక్ పై వెళుతున్న ముగ్గురు మైనర్లు ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో శివ(18), సూరజ్ (17), బాలు(17) తీవ్ర గాయాలయ్యా యి.

క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించగా చికిత్స అందిస్తుండగా శివ మృతి చెందాడు. అపస్మారక స్థితిలో ఉన్న సూరజ్ ను గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ముగ్గురు బీహార్ కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.