calender_icon.png 28 July, 2025 | 9:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుషాయిగూడలో అదృశ్యమైన రేణిగుంట్ల దుర్గా ప్రసాద్

28-07-2025 01:25:37 AM

దుర్గంచెరువులో మృతదేహంగా ప్రత్యక్షం

శేరిలింగంపల్లి, జూలై 27: కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధి సైని క్ పూరికి చెందిన ఓ వ్యక్తి అదృశ్యమై ఆదివారం దుర్గం చెరువులో మృతదేహంగా ప్రత్యక్షమైన ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సైని క్ పూరికి చెందిన రేణిగుంట్ల దుర్గా ప్ర సాద్ (36) అనే వ్యక్తి ఆర్డి ప్రో ఈవెం ట్స్ నిర్వాహకుడుగా పనిచేస్తున్నాడు.

ఈనెల 25 సాయంత్రం షాపు నుండి బయటకు వెళ్లిన ప్రసాద్ ఇంటికి రాకపోవడంతో 26న కుషాయిగూడ స్టేష న్‌లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఆదివారం దుర్గం చెరువులో మృతదేహం ఉందని వచ్చిన సమాచారంతో బయటకు తీసి చూడగా సైనిక్ పూరికి చెందిన దుర్గాప్రసాద్ గా గుర్తించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.