28-07-2025 01:27:03 AM
కొండాపూర్‌లో -తొమ్మిది మంది అరెస్ట్
-6 కార్లు, డ్రగ్స్ స్వాధీనం
-ఏపీ నుంచి యువతుల్ని తీసుకొచ్చినట్టు సమాచారం
శేరిలింగంపల్లి, జూలై 27: హైదరాబాద్, కొండాపూర్‌లోని ఓ సర్వీస్ అపా ర్ట్‌మెంట్‌లో రహస్యంగా జరుగుతున్న రేవ్ పార్టీపై ఎక్సుజ్ పోలీసులు దాడి చేశా రు. విశ్వసనీయ సమాచారం ఆధారంగా శనివారం అర్ధరాత్రి రాష్ర్ట ఎక్సుజ్ టాస్క్‌ఫోర్స్ (ఎస్టీఎఫ్) బీ టీం ఎస్‌ఐ సంధ్య బాలరాజు నేతృత్వంలో దాడికి దిగారు.
ఈ దాడిలో మొత్తం 9 మందిని అరెస్ట్ చేశారు. రేవ్ పార్టీకి ఏపీ నుంచి యువతను ప్రత్యేకంగా హైదరాబాద్‌కు తీసుకొ చ్చినట్టు సమాచారం. అరెస్టయిన వారిలో విజయవాడ, మంగళగిరి, కాకినాడ, రాజమండ్రి ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారు. ఈ పార్టీని విజయవాడకు చెందిన నాయుడు అలియాస్ వాసు అనే వ్యక్తి ఫేక్ ఆధారాలతో ఏర్పా టు చేసినట్టు పోలీసులు గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితుల నుంచి 6 కార్లు, రెండు కిలోల గంజాయి, 50 గ్రాముల కుష్ డ్రగ్, 11.5 గ్రాముల మ్యూజిక్ మషమ్,్ర 1.9 గ్రాముల మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 11 మందిపై ఎక్సుజ్ పోలీసులు కేసు నమోదు చేశా రు. అరెస్టయిన వారిలో డ్రగ్స్ సరఫరాదారుడు కింగ్ కేన్ షేర్ రాహుల్, పార్టీ ఆర్గనైజర్‌లు మన్నె అప్పికోట్ల అశోక్ కుమార్, సమ్మెల సాయికృష్ణ, అడపా యశ్వంత్, హిట్ జోసఫ్, తోట కుమారస్వామి, శ్రీదత్, నంద్, సమతా తేజ ఉన్నారు. ఇంకా ఇద్దరు పరారీలో ఉన్నట్టు సమాచారం. ఈ కేసును శేరిలింగంపల్లి ఎక్సుజ్ పోలీసులకు అప్పగించి నట్టు ఎస్టీఎఫ్ సీఐ సంధ్య వెల్లడించారు.
వీకెండ్ వచ్చిందంటే చాలు పీకలులోతు మందు, డ్రగ్స్ తాగేందుకు, పార్టీ లు చేసుకునేందుకు యువత సిద్ధమవుతున్నారు. ఆడ, మగ తేడా లేకుండా ఈ రేవ్ సంస్కృతికి బానిసలవుతున్నారు. నగర శివార్లలో ఈ పార్టీలు నిత్యకృత్యంగా మారుతున్నాయి. పో లీసుల దాడులతో కొన్ని బయట పడుతున్నా.. చాలావరకు ఇంకా గు ట్టుచప్పుడు కాకుండా సాగుతున్నా యి. ఈ ఘటన మరోసారి పోలీసుల అప్రమత్తతను రుజువు చేసినా ఈ తరహా డ్రగ్ మాఫియాలపై నిఘా పెట్టే వ్యవస్థ మరింత బలపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ‘డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ’ నినాదం మామూలుగా మిగిలిపోకుండా కార్యరూపం దా ల్చాలంటే, ఈ రేవ్ ముఠాలకు వెనక ఉన్న మాయగాళ్లను తేల్చాల్సిందన ని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.