ఎర్రవల్లి చౌరస్తాలో హోర రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి
01-06-2024 10:58 AM
ఎర్రవల్లి: జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం చౌరస్తా సమీపంలోని 44వ జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వచ్చి అదుపుతప్పిన లారీ- కారు ఢీకొని నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గద్వాల జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆళ్లగడ్డ పట్టణం నుంచి హైదరాబాద్ కు వేగంగా ప్రయాణిస్తున్న స్కార్పియో వాహనం ఎదురుగా వస్తున్న లారీని బలంగా ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు.






