25 August, 2026 | 3:38 AM

ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రాధాన్యం

25-08-2026 12:00 AM

అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి

మేడ్చల్, ఆగస్టు 24(విజయ క్రాంతి): ప్రజా సమస్యలను సత్వరం పరిష్కరించడమే జిల్లా యంత్రాంగం లక్ష్యమని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) విజయేందర్ రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా సమీకృత కలెక్టరేట్ సముదాయం  సమావేశ మందిరంలో నిర్వహించిన ’ప్రజావాణి’ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై, ప్రజల నుంచి వినతులను స్వీకరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజావాణికి వచ్చే ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, సంబంధిత శాఖల అధికారులకు సత్వర పరిష్కారం కోసం పంపుతున్నట్లు తెలిపారు. సమస్యల పరిష్కారంలో జాప్యం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.  ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజల నుంచి మొత్తం 75 దరఖాస్తులు అందాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి మాలతి, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.