6 July, 2026 | 11:16 PM

జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీ

11-06-2024 02:20 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 10 (విజయక్రాంతి): హైదరాబాద్ జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల్లో చదు వుతున్న జర్నలిస్టుల పిల్లలకు 2024-25 విద్యా సంవత్సరానికి ఫీజులో రాయితీ ఇచ్చేలా జిల్లా వి ద్యాశాఖ అధికారిణి రోహిణి సోమ వారం సర్క్యులర్ జారీ చేశారు. హై దరాబాద్ యూనియన్ ఆఫ్ జర్న లిస్ట్స్ (హెచ్ యూజే) జిల్లా అధ్యక్షు డు శిగ శంకర్, కార్యదర్శి ఖాజా అబ్దుల్ హమీద్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర నాయకుడు ఏ  రాజేష్ నేతృ త్వంలోని ప్రతినిధి బృందం చేసిన విన్నపానికి డీఈవో స్పందించారు. దీనికి సంబంధించిన సర్క్యులర్ కాపీని డీఈవో సోమవారం హెచ్ యూజే నాయకులకు అందజేశారు. ఈ సందర్భంగా హెచ్‌యూజే జిల్లా అధ్యక్షుడు శంకర్ మాట్లాడుతూ.. జిల్లాలో అర్హులైన పాత్రికేయులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసు కోవాలని సూచించారు.