24-05-2025 11:24:42 PM
రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ నాయకులు..
కామారెడ్డి (విజయక్రాంతి): అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేయాలని డిమాండ్ తో భిక్కనూర్ అన్నదాతలు శనివారం తడిసిన ధాన్యాన్ని రహదారిపై పోసి రాస్తారోకో నిర్వహించారు. రైతులు టిఆర్ఎస్ నాయకుడు రవీందర్ మాట్లాడుతూ... తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలన్నారు. దాన్యం కొనుగోలు చేయకపోవడంతోనే గల వర్షాలకు తమ ధాన్యం తడిసి మొలకలు రావడం జరిగిందని వెంటనే తమ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, అప్పటివరకు ఇకనుంచి వెళ్లే ప్రసక్తి లేదని రోడ్డుపై కూర్చున్నారు. ఈ విషయం తెలుసుకున్న సొసైటీ అధ్యక్షుడు భూమయ్య ,ఎస్సై ఆంజనేయులు చేరుకొని దాన్నే వెంటనే కంట చేయడం జరుగుతుందని రైతులు ఆందోళన విరమించాలని కోడంతో వారు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.