16 July, 2026 | 9:32 AM

‘ఆప్’ రెండో జాబితా విడుదల జంగ్‌పురా నుంచి మాజీ సీఎం సిసోడియా పోటీ

10-12-2024 12:26 AM

న్యూఢిల్లీ, డిసెంబర్ 9: ఢిల్లీలో  జనవరిలో జరుగనున్న  అసెంబ్లీ ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సిద్ధమవుతున్నది. ఎన్నికల షెడ్యూలు విడుదల కాకముందే సోమవారం 20 మంది అభ్యర్థులతో రెండో జాబితాను ప్రకటించింది.  మాజీ సీఎం మనీశ్ సిసోడియా జంగ్‌పురా స్థానం నుంచి పోటీ చేయను న్నారు. ఆయన కొనేళ్ల నుంచి పటఫడ్ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఈ ఎన్నికల్లో ఆ స్థానాన్ని త్యాగం చేశా రు. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానా లు ఉండగా, ఆప్ ఇప్పటికే మొదటి విడతలో 11 మందితో జాబితాను ప్రకటించింది.