18 May, 2026 | 7:27 AM

బీజేపీ, బీఆర్‌ఎస్‌లకు ఓట్లడిగే హక్కు లేదు

22-04-2024 01:15 AM

l అధికారంలో ఉండి మత్స్యకారులకు ఏం చేయలేకపోయారు

l ఫిషరీష్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ 

హైదరాబాద్, ఏప్రిల్ 21 (విజయక్రాంతి): బీజేపీ, బీఆర్‌ఎస్ గత పదేళ్లుగా అధికారంలో ఉండి మత్స్యకారులను పట్టించుకోలేదని ఫిషరీష్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ అన్నారు. ఆదివారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఆ రెండు పార్టీలకు పార్లమెంట్ ఎన్నికల్లో మత్స్యకారులను ఓట్లు అడిగే హక్కు లేదని పేర్కొన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలకు తగిన గుణపాఠం చెప్పడానికి మత్స్యకారులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. బీజేపీ మోసానికి.. బీఆర్‌ఎస్ దగాకు కేరాఫ్‌గా మారాయని విమర్శించారు.