12-10-2025 03:52:29 AM
హైదరాబాద్, అక్టోబర్ 11 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి ఎంపిక ప్రక్రియ ఢిల్లీకి చేరింది. తుది జాబితాతో అభ్యర్థిని ఖరారు చేసేందుకు పార్టీ రాష్ట్ర అధక్షుడు ఎన్ రాంచందర్‌రావు ఢిల్లీకి చేరుకొని జాతీయ నాయకత్వంతో భేటి అయ్యారు. ముఖ్యనేతలు సునీల్ బన్సల్, బీఎల్ సంతోష్‌తో ఆయన శనివారం సమావేశమైనట్టు తెలిసింది. రాష్ట్ర ఎన్నికల కమిటీ ఖరారు చేసి జాతీయ నాయకత్వం ముందుంచినట్టు తెలిసింది. అయితే పార్లమెంటరీ పార్టీ బోర్డులో చర్చ అనంతరం బీజేపీ అభ్యర్థి పేరును ప్రకటించనున్నారు.టికెట్ రేసులో లంకల దీపక్‌రెడ్డి, కీర్తిరెడ్డి, ఆకుల విజయ, వీరపనేని పద్మ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.