12-10-2025 03:50:09 AM
ప్రభుత్వానికి రాష్ట ఎన్నికల కమిషన్ లేఖ
హైదరాబాద్,అక్టోబర్11(విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ఎన్నికల సంఘం న్యాయ నిపుణులతో చర్చించింది.ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేదని హైకోర్టు తాజా ఉత్వర్వుల్లో పేర్కొంది.జీవో 9,41పై మాత్రమే స్టే ఇచ్చినట్లు హైకోర్టుమధ్యంతరఉత్తర్వులుజా రీ చేసింది. పాత రిజర్వేషన్ల ప్రకారం 50 శాతం రిజర్వేషన్లు మించకుండా ఎన్నికలు నిర్వహించుకోవాలని సూచించింది. ఈ మే రకు న్యాయ నిపుణుల నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నాక తదుపరి నిర్ణయం తీసుకోకున్నట్లు ఎస్‌ఈసీ స్పష్టం చేసింది.
ఈ మేరకు ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ లేఖ రాసింది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా, తదుపరి చర్యలు, రిజర్వేషన్ల అంశంపై లేఖలో వివరణ కోరింది. ఇటీవల కోర్టు తీర్పు నేపథ్యంలో స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఎన్నికల కమిషన్ కోరింది. స్థానిక సంస్థల ఎ న్నికల నిర్వహణపై హైకోర్టు అభ్యంతరం తెలపలేదని కూడా ఎస్‌ఈసీ లేఖలో వెల్లడించింది.