12-10-2025 03:54:01 AM
హైదరాబాద్, అక్టోబర్ 11 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఆదివారం నుంచి నాలుగు రో జుల పాటు వర్షాలు కురుస్తాయని తెలంగాణ వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. గంటకు 30 వేగంతో గాలులు సైతం వీస్తాయని తెలిపింది. ఆదివారం జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో వర్షాలు కురుస్తాయని వాతావారణ శాఖ సూచించింది.