25-11-2025 10:23:36 AM
హైదరాబాద్: కాసేపట్లో జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం(GHMC Council meeting) ప్రారంభం కానుంది. దున్నపోతు మీద వాన పడ్డ చలనం ఉండనట్లే… ప్రజల సమస్యలపై ఎన్నిసార్లు వినతిపత్రాలు ఇచ్చినా జీహెచ్ఎంసీ అధికారులు, మేయర్ కి ఎలాంటి స్పందన లేదని బీజేపీ కార్పొరేటర్లు(BJP corporators) ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ఇబ్బందుల పట్ల పూర్తిగా నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా కనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్ఎంసీకి టాక్స్ కలెక్షన్ల విషయంలో ఉన్న శ్రద్ధ, ప్రజల నిత్య సమస్యల దగ్గర మాత్రం కనిపించడం లేదని ఆరోపిస్తున్నారు. ఈ నిర్లక్ష్యానికి నిరసనగా మంగళవారం నాడు సరూర్నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి, మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్, మూసాపేట్ కార్పొరేటర్ మహేందర్ సంకెళ్లు వేసుకొని జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు ప్రతీకాత్మకంగా దున్నపోతుకే వినతిపత్రాలు అందజేశారు.
