25-11-2025 10:33:37 AM
హైదరాబాద్: మంగళవారం నాడు జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం(GHMC Council meeting) జరగనుంది. కౌన్సిల్ సమావేశంలో ప్రజా సమస్యలపై వాడీవేడీగా చర్చ జరగనుంది. మొత్తం 46 ఎజెండా అంశాలపై కౌన్సిల్ చర్చించనున్నట్లు సమాచారం. కౌన్సిల్ సమావేశానికి బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆదర్శ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి ర్యాలీగా వెళ్లనున్నారు. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పార్టీ జిహెచ్ఎంసి కార్పొరేటర్లతో నిన్న కేటీఆర్ సమావేశం అయ్యారు. కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహం పై కార్పొరేటర్లకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.
పలు అంశాలపై నిరసనలు తెలిపేందుకు బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లు సిద్ధమయ్యారు. ప్రభుత్వ భూముల అమ్మకంపై బీఆర్ఎస్ కార్పొరేటర్లు నిలదీయనున్నారు. దున్నపోతుకు వినతిపత్రం ఇచ్చి సమావేశానికి బీజేపీ కార్పొరేటర్లు సమావేశానికి హాజరుకానున్నారు. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి(Gadwal Vijayalakshmi) అధ్యక్షతన కౌన్సిల్ చివరి సమావేశం కావడం విషయం. 2026 ఫిబ్రవరి 11తో జీహెచ్ఎంసీ పాలకవర్గం గడువు ముగియనుంది. జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశం సందర్భంగా జీహెచ్‌ఎంసీ కార్యాలయం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.