15 April, 2026 | 1:11 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

బెల్లంపల్లిలో ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

06-04-2025 02:33 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆదివారం బీజేపీ నాయకులు ఘనంగా జరుపుకున్నారు. బెల్లంపల్లి పట్టణ అధ్యక్షులు దార కళ్యాణి  ఆధ్వర్యంలో పాత బస్టాండ్, రైల్వే స్టేషన్ భారతీయ జనతా పార్టీ జెండా (బీజేపీ)ను ఎగురేశారు. ఈ సందర్భంగా దార కళ్యాణి మాట్లాడుతూ... భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ వ్యవస్థాపకులను కార్యకర్తలు చేసిన త్యాగాలని స్మరించుకోవాలని సూచించారు. భారతీయ జనతా పార్టీ దేశం కోసం, ధర్మం కోసం పని చేస్తుందన్నారు.