6 April, 2026 | 7:51 PM

ఘనంగా బిజెపి ఆవిర్భావ వేడుకలు

06-04-2026 06:09 PM

భైంసా,(విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ వెడుకలను మంగళవారం ఆయా గ్రామాల్లో నిర్వహించారు. కల్లూరు కుంటాల ఓలా లింబకి గ్రామంలో కార్యక్రమంలో జెండాలు ఎగురవేశారు, కుంటాల సర్పంచ్ జక్కుల గజేంధర్ మాట్లాడుతూ... బిజెపి చేసిన సేవలను సంక్షేమ పథకాలే పార్టీని మూడవసారి అధికారంలోకి తీసుకోచ్చాయని కొనియాడారు. ప్రపంచంలో అతి పెద్ద పార్టీగా ఆవిర్భావించిన పార్టీలో కార్యకర్తలను అయినందుకు గర్వంగా ఉందని తెలిపారు, ఈ కార్యక్రమంలో సర్పంచ్ కుబీరే రాజన్న ఎర్రోజు ప్రశాంత్ నాయకులు సౌదరి లక్ష్మణ్ పటేల్ కల్యాణి గజేంధర్ తాటి శివ సుద్దపు ముత్యం మాధవ్ రావ్ న్యకాపు నరేందర్ బోగ రవీందర్ సట్ల వినోద్ ఎడ్ల గజేందర్ ముద్దం వినోద్ తదితరులు పాల్గొన్నారు