సుల్తానాబాద్ లో ఘనంగా భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల పరిధిలో భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు కందుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో సోమవారం మండల కేంద్రంలోని పూసాల రోడ్డు తో పాటు కాట్నాపల్లి, గర్రెపల్లి, రేగడి మద్దికుంట, అల్లిపూర్,కోదురుపాక, ఐతారాజ్ పల్లి, గొల్లపల్లి, రామునిపల్లి తోపాటు వివిధ గ్రామాలలో, బూత్ లలో వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు కర్ర సంజీవ్ రెడ్డి,గొట్టిముక్కుల సురేష్ రెడ్డి, నల్ల మనోహర్ రెడ్డి,జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి అశోక్ రావు, ఉపాధ్యక్షులు సౌదరి మహేందర్ యాదవ్,మిట్టపల్లి ప్రవీణ్,కామని రాజేంద్ర ప్రసాద్ పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఎగరవేసి, మిఠాయిలు పంచుతూ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు మాట్లాడుతూ.. దేశానికి దేశభక్తి, ప్రజాసంక్షేమం లక్ష్యంగా శ్యామ ప్రసాద్ ముఖర్జీ జనసంఘ్‌ను స్థాపించినట్లు పేర్కొన్నారు.
ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీ సమయంలో ప్రజాస్వామ్యవాదులపై జరిగిన అణచివేతను ఆయన గుర్తుచేశారు. అనంతరం జనతా పార్టీ ఏర్పడి ప్రజల మద్దతు పొందినప్పటికీ, స్పష్టమైన సిద్ధాంతాలతో ముందుకు సాగాలనే ఉద్దేశంతో 1980 ఏప్రిల్ 6న భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించిందన్నారు.మచ్చలేని నాయకత్వం కలిగిన అటల్ బిహారీ వాజపేయి గారిని పార్టీ తొలి అధ్యక్షునిగా నియమించుకున్నారని తెలిపారు. ఎన్నో ఎత్తుపల్లాలు ఎదుర్కొన్న బీజేపీ, దేశ ప్రజల ఆశీర్వాదంతో 2014లో నరేంద్ర మోదీ నాయకత్వంలో అధికారంలోకి వచ్చిందన్నారు.
గత పదేళ్లలో దేశానికి సుపరిపాలన అందించడమే కాకుండా, ప్రజల ఆత్మగౌరవాన్ని పెంపొందించిందని పేర్కొన్నారు.ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా ఎదిగిన బీజేపీ మరింత అభివృద్ధి చెందాలని, ప్రజల ఆశీస్సులతో విజయాలు సాధించాలని కోరుతూ పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో రూరల్ బీజేపీ నాయకులు చాతరాజు రమేష్, కోట నాగేశ్వర్, కొల్లూరి సంతోష్,కొమ్మిడి రాజేందర్ రెడ్డి, వడ్లకొండ శశివర్ధన్,మల్క భాగ్యలక్ష్మి,పెరక రమేష్, మారం రమేష్, ఏనుగు రాజిరెడ్డి, వీరగోని కిరణ్, డాక్టర్ బుమయ్య, మనోహర్, శేఖర్ మాస్టర్ తదితరులు పాల్గొన్నారు...




