06-12-2025 07:45:10 PM
కొమురవెల్లి,(విజయక్రాంతి): ప్రసిద్ధ శైవ క్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా కమ్యూనికేషన్( సిగ్నల్ ప్రాబ్లం) తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని మండల బిజెపి నాయకులు కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలిసి సమస్యను విన్నవించారు. జాతర సమయంలో అధిక సంఖ్యలో భక్తులు తరలి రావడంతో మొబైల్ సిగ్నల్ ప్రాబ్లం ఏర్పడుతుంది.
దీంతో భక్తులకు అసౌకర్యంగా మారుతుంది. భక్తులకు సిగ్నల్ సమస్య రాకుండా చూడాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దృష్టికి తీసుకుపోగా, ఆయన సానుకూలంగా స్పందించి, జాతర సమయానికల్లా సిగ్నల్ సమస్య పరిష్కరించాలని టెలిఫోన్ ఆపరేటర్లకు ఆదేశాలు జారీ చేశారు.ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు బురుగోజు స్వరూప, ఎక్కల దేవి శ్రీనివాస్, బూర్గోజు నాగరాజు ఎక్కల దేవి మధు, పాశం భరత్ తదితరులు పాల్గొన్నారు.