calender_icon.png 6 December, 2025 | 9:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈశ్వర చారి కుటుంబాన్ని ఆదుకోవాలి

06-12-2025 07:47:46 PM

నిర్మల్ (విజయక్రాంతి): బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ నిప్పంటించుకుని ఆత్మ బలిదానం చేసుకున్న ఈశ్వర చారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు పేర్కొన్నారు. శనివారం బీసీ రిజర్వేషన్ల కోసం ప్రాణ త్యాగం చేసిన ఈశ్వర చారికి పట్టణంలోని గాంధీ చౌక్ లో ఘనంగా నివాళులర్పించి రెండు నిమిషాల సేపు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు నరేష్ కొండా జి శ్రావణ్ అనిల్ తదితరులు ఉన్నారు.