12 June, 2026 | 12:57 PM

Breaking News

మీనాక్షి నటరాజన్ కేసులో పిటిషనర్ బండారు శ్రీలత కీలక వ్యాఖ్యలు   •   ప్రముఖ 'మాండ్' గాయని గావ్రీ దేవి కన్నుమూత   •   తెలంగాణలో ఓ వైపు భారీ వర్షాలు.. మరోవైపు ఎండలు   •   నిజాంసాగర్ ప్రాజెక్టులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి   •   రోడ్డుప్రమాదంలో మేకల కాపరి, 20 మేకలు మృతి   •   వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై ప్రవీణ్ కుమార్   •   బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన.. ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత   •   భార్య‌తో గొడ‌వ‌.. పిల్లలతో కలిసి నిజాంసాగ‌ర్‌లో దూకిన తండ్రి   •   నివాస భవనంలో అగ్నిప్రమాదం: ముగ్గురు మృతి, ఇద్దరికి గాయాలు   •   షూటర్ జస్పాల్ రాణా మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం   •  

కాంగ్రెస్ బీసీలను మోసం చేసింది

29-11-2025 08:32 PM

- బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా మాజీ అధ్యక్షుడు సామ రంగారెడ్డి.. 

- ఎల్బీనగర్ లో బీజేపీ నాయకుల ఆందోళన.. 

ఎల్బీనగర్: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్ అమలు చేస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత 17 శాతం రిజర్వేషన్ ఇచ్చి బీసీలను మోసం చేసిందని బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా మాజీ అధ్యక్షుడు సామ రంగారెడ్డి అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఖరారు చేయాలంటూ బీజేపీ నాయకులు శనివారం ఎల్బీనగర్ చౌరస్తాలో ఆందోళన చేపట్టారు. నిరసనలో భాగంగా రేవంత్ రెడ్డి ఫొటోతో ఉన్న ఫ్లెక్సీని తగలబెడుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు బీజేపీ నాయకులు మధ్య తోపులాట, వాగ్వివాదం జరిగింది. అనంతరం బీజేపీ నాయకులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు.

ఈ సందర్భంగా సామ రంగారెడ్డి మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం 42శాతం బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.2023 శాసనసభ ఎన్నికల ముందు జరిగిన కామారెడ్డి సభలో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ, బీసీలకు రాజకీయ, విద్యా, ఉద్యోగ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. 2023లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన కామారెడ్డి డిక్లరేషన్ ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలు ఇస్తూ బీసీలను విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలల్లో రీత్యా అణిచివేస్తున్నారని ఆరోపించారు. బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పుతామని హెచ్చరించారు.

బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతల సురేందర్ యాదవ్ మాట్లాడుతూ..‌ తెలంగాణ రాష్ట్రంలో బీసీ జనాభా అధికం ఉన్నప్పటికీ, వారి రాజకీయ భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి నిజమైన చర్యలు తీసుకోలేదన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ పవన్ కుమార్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు గీతా రెడ్డి, నాయకులు నూతి శ్రీనివాస్ రావు, సుందర్ నారాయణ, పంగా శ్యామ్, రాజేష్, మల్లేష్ గౌడ్, కవితా రెడ్డి, నూకల పద్మారెడ్డి, కేశిరెడ్డి పద్మారెడ్డి, గీతా రెడ్డి, వినోద్ యాదవ్, రావుల శ్రీనివాస్ గౌడ్, సంతోష్, నరేశ్ యాదవ్, రాము గౌడ్, శివకుమార్, మనోజ్ కుమార్, రాఘవాచారి తదితరలు పాల్గొన్నారు.