12 June, 2026 | 2:05 PM

Breaking News

సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్‌కు షాక్.. పిటిషన్ డిస్మిస్   •   కూసుమంచి శివాలయంకు పెరిగిన ఆదాయం   •   కూసుమంచి సర్పంచ్ కొండా కృష్ణవేణి-మహిపాల్ లను ఆశీర్వదించిన మంత్రి పొంగులేటి   •   మల్లాపూర్‌లో పందుల బీభత్సం.. చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల విజ్ఞప్తి   •   బాలికపై దారుణానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి   •   ప్రభుత్వ కళాశాల అడ్డిషన్ల కోసం గడపగడప ప్రచారం   •   సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేత   •   ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభానికి సిద్ధం చేయండి   •   సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్ పిటిషన్‌పై విచారణ   •   మీనాక్షి నటరాజన్ కేసులో పిటిషనర్ బండారు శ్రీలత కీలక వ్యాఖ్యలు   •  

మొదటి ఓటు.. వార్డు సభ్యుడిగా పోటీ

29-11-2025 08:24 PM

స్థానిక ఎన్నికల బరిలో యువతి పాల్గొనడం పట్ల హర్షం

ఓటు హక్కు వచ్చిన వెంటనే నాయకత్వం వైపు అడుగు

తుంగతుర్తి,(విజయక్రాంతి): స్థానిక ఎన్నికల వేళ గ్రామ రాజకీయం కొత్త ఊపందుకుంది. మొట్టమొదటిసారి ఓటు హక్కు పొందిన యువతి ధైర్యంగా సర్పంచ్ ఎన్నికల్లో వార్డు  స్థానానికి నామినేషన్ దాఖలు చేయడం గ్రామంలో విశేష చర్చగా మారింది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల పరిధిలోని వెంపటి గ్రామానికి చెందిన నాతి భావన, భర్త రచ్చ నవీన్ చిన్నతనం నుండి విద్య, పర్యావరణం, మహిళల విద్య, యువత అభివృద్ధిపై ఆసక్తి చూపుతూ గ్రామానికి సేవ చేయాలనే సంకల్పంతో ముందుకు వచ్చిన ఆమె త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వెంపటి గ్రామం నుండి తనకు ఓటు హక్కు వచ్చిన వెంటనే, వార్డు మెంబర్ కు తన నామినేషన్ పత్రాన్ని తన చంటి బిడ్డతో వచ్చి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ఓటు వేసే హక్కు వచ్చినా, నాయకత్వం తీసుకునే హక్కు కూడా మనకుందన్నారు. మార్పు కోసం ఎదురు చూడకుండా, మనమే మార్పుకు దారి చూపాలని భావోద్వేగంతో చెప్పింది. గ్రామంలో తాను పోటీ చేసే వార్డులో అభివృద్ధి, పారదర్శక పాలన, తాగునీటి సమస్యలు, మహిళల స్వయం సహాయక సంఘాల బలోపేతం, ఉద్యోగ అవకాశాల పెంపు వంటి అంశాలు తన లక్ష్యాలని ఆమె తెలిపారు. ఈ ఎన్నికల్లో మహిళలకు ఎక్కువ రిజర్వేషన్లు కల్పించినప్పటికీ, యువత రాజకీయ రంగ ప్రవేశం చేయడం గ్రామ రాజకీయాల్లో కొత్త అధ్యాయం రాస్తుందనే అభిప్రాయం గ్రామ ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఏది ఏమైనా భావన తీసుకున్న నిర్ణయం పట్ల మహిళలు, కుటుంబీకులు మేధావులు గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.